News8th Jul 03:22 PMSunil Byrisetty1 min read

సంప్రదాయ పట్టు వస్త్రాలతో సీఎం చంద్రబాబు శ్రీశైల దర్శనం

సంప్రదాయ పట్టు వస్త్రాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనం చేసుకున్నారు. అనంతరం నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు వద్

సంప్రదాయ పట్టు వస్త్రాలతో సీఎం చంద్రబాబు శ్రీశైల దర్శనం
సంప్రదాయ పట్టు వస్త్రాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనం చేసుకున్నారు. అనంతరం నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు మధ్యాహ్నం 2.10 గంటలకు చేరుకున్నారు. స్థానిక రైతులతో కలిసి ప్రాజెక్టుపై నడుచుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రికి మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో ఆలయ వేద పండితులు ఆహ్వానం పలికారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అక్కడ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను, రాయలసీమ ప్రాజెక్టుల స్కీమాటిక్ రేఖాచిత్రం మ్యాపును సీఎం తిలకించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పిమ్మట కృష్ణమ్మకు జల హారతులు ఇచ్చి, రైతుల హర్షద్వానాల మధ్య కృష్ణమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు 6, 7, 8, 11 నెంబర్ల రేడియల్ గేట్లను తెరచి నీటిని దిగువకు వదిలారు. పరవళ్ళు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తున్న కృష్ణమ్మ నదిని చూసి ముఖ్యమంత్రి పులకరించి పోయారు.
Andhra Pradesh news
Srisailam project
cm chandra babu
Srisailam temple
Srisailam dam gates
సంప్రదాయ పట్టు వస్త్రాలతో సీఎం చంద్రబాబు శ్రీశైల దర్శనం
Scroll for the next article