News9th Aug 02:01 PMSunil Byrisetty1 min read
పాడేరులో సీఎం చంద్రబాబు పర్యటన
పాడేరులో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. వంజంగిలోని వనదేవత మోదకొండమ్మను దర్శించుకున్నారు. సమీపంలోని కాఫీ ప్లాంటేషన్లోని తోటలను పరిశీలించారు. కాఫీ ప్లాంటేషన్ పెంపకందారులతో మ
పాడేరులో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. వంజంగిలోని వనదేవత మోదకొండమ్మను దర్శించుకున్నారు. సమీపంలోని కాఫీ ప్లాంటేషన్లోని తోటలను పరిశీలించారు. కాఫీ ప్లాంటేషన్ పెంపకందారులతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ తోటల పెంపకంలో ఇబ్బందులేమైనా ఉన్నాయా అంటూ చంద్రబాబు ఆరా తీశారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద గిరిజన ప్రాంతంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేపట్టారు. ప్రకృతిని ఎంజాయ్ చేసేలా ఆరోగ్యకరమైన వాతావరణంలో హోం స్టే ఉండేలా సీఎం చూసుకోవాలన్నారు. గిరిజన ఉత్పత్తులకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు.