News3rd Oct 04:57 PMSunil Byrisetty1 min read

ఆటో డ్రైవర్ సేవలో.. రేపు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది. ఇప్పటికే పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం....ఈ క్రమంలో డ్రైవర్ల సంక్షేమం కోసం ‘ఆటో డ్రైవర్ సేవలో...’ పథకానికి శ

ఆటో డ్రైవర్ సేవలో.. రేపు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది. ఇప్పటికే పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం....ఈ క్రమంలో డ్రైవర్ల సంక్షేమం కోసం ‘ఆటో డ్రైవర్ సేవలో...’ పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం రూపొందించింది. ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇవ్వనున్నారు. ఈ పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరుకానున్నారు. సొంత ఆటో, క్యాబ్ కలిగి వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారి కోసం రూపొందించిన ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.436 కోట్లను కేటాయించింది. ఈ నిధులను నేరుగా డ్రైవర్ల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది.
Andhra Pradesh
Auto Driver Welfare Scheme
Chandrababu Naidu
Pawan Kalyan
Nara Lokesh
BJP Madhav
Vijayawada
Government Scheme
ఆటో డ్రైవర్ సంక్షేమం
మాక్సీ క్యాబ్
మోటార్ క్యాబ్
డ్రైవర్ ఆర్థిక సహాయం
Scroll for the next article