News6th Jan 04:57 PMSunil Byrisetty1 min read
టీమ్ వర్క్.. బెటర్ రిజల్ట్స్.. ఇవే అభివృద్ధి మంత్రం
2025వ సంవత్సరంలో టీమ్ వర్క్ తో చేయడం వల్లే పెట్టుబడుల్లో బెటర్ రిజల్ట్స్ సాధించామని.. ఈ 2026లోనూ అదే ఉత్సాహంతో పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు, అధికారులకు ద
2025వ సంవత్సరంలో టీమ్ వర్క్ తో చేయడం వల్లే పెట్టుబడుల్లో బెటర్ రిజల్ట్స్ సాధించామని.. ఈ 2026లోనూ అదే ఉత్సాహంతో పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 2025లో రాష్ట్రం కోసం అందరూ అద్భుతంగా పని చేశారు. గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ ఇమేజ్ రాష్ట్రానికి తిరిగి వచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. గూగుల్, టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయి. ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలి.”అని సీఎం చంద్రబాబు చెప్పారు.ఎస్ఐపీబీ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ఐటీ ఇన్ఫ్రా పోర్టల్ ను ప్రారంభించారు.