News28th Jul 05:42 PMSunil Byrisetty1 min read
సింగపూర్ - ఆంధ్రప్రదేశ్ మధ్య సహకారం కొనసాగాలి
రెండో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్ర స్థాయి పర్యటనలు చేశారు. సోమవారం సింగపూర్‌లో 10 వేల కుటుంబాలు నివాసం ఉండే బిడదారి ఎస్టేట్‌ను సీఎం బృందం సందర్శించిం
రెండో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్ర స్థాయి పర్యటనలు చేశారు. సోమవారం సింగపూర్‌లో 10 వేల కుటుంబాలు నివాసం ఉండే బిడదారి ఎస్టేట్‌ను సీఎం బృందం సందర్శించింది. ఏపీలో భారీ ఎత్తున అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ క్రమంలో సింగపూర్ దేశంలో అర్బన్ హౌస్ ప్లానింగ్ ఏ విధంగా ఉందనే అంశాన్ని పరిశీలించేందుకు బిడదారి ఎస్టేటును సీఎం చంద్రబాబు సందర్శించారు. సిటీ ఇన్ ఎ గార్డెన్ పేరుతో ఏర్పాటైన హౌసింగ్ ప్రాజెక్ట్ విశిష్టతలను ముఖ్యమంత్రికి సింగపూర్ అధికారులు వివరించారు. మొత్తం 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హౌసింగ్ ప్రాజెక్టు ప్రాంతంలో సుమారు రెండు గంటల పాటు సీఎం చంద్రబాబు కాలినడకన సందర్శించారు. కొత్త ఆలోచనలతో, ఆధునిక వసతులతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నామని చంద్రబాబు అన్నారు. భవిష్యత్‌లోనూ సింగపూర్-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.