News21st Aug 11:00 AMSunil Byrisetty1 min read

శ్రీశైలం ఎమ్మెల్యేపై కేసు.. ఆదేశించిన సీఎం చంద్రబాబు

నల్లమల అటవీ ప్రాంతంలో ప్రభుత్వోద్యోగులపై దాడి వ్యవహారంపై సీఎం చంద్రబాబు స్పందించారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ సిబ్బందితో గొడవపై

శ్రీశైలం ఎమ్మెల్యేపై కేసు.. ఆదేశించిన సీఎం చంద్రబాబు
నల్లమల అటవీ ప్రాంతంలో ప్రభుత్వోద్యోగులపై దాడి వ్యవహారంపై సీఎం చంద్రబాబు స్పందించారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ సిబ్బందితో గొడవపై ఆరా తీసిన చంద్రబాబు.. బుడ్డా తీరు వివాదాలకు ఆస్కారం ఇచ్చేలా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. మరోవైపు అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కూడా ఈ విషయంలో స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Andhra Pradesh news
Chandrababu Naidu
Srisailam MLA
Budda Rajasekhar Reddy
Forest Officials Attack
Pawan Kalyan
Law and Order
శ్రీశైలం ఎమ్మెల్యేపై కేసు
అటవీ సిబ్బందిపై దాడి
Scroll for the next article