News12th Aug 01:39 PMSunil Byrisetty1 min read

రికార్డు టైమ్ లో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలి

అమరావతి- రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, పురపాలక, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, సీఆర్డీఏ న

రికార్డు టైమ్ లో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలి
అమరావతి- రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, పురపాలక, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, సీఆర్డీఏ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు సమీక్షకు హాజరయ్యారు. రాజధాని నిర్మాణం కోసం మొత్తం రూ. 81,317 కోట్ల మేర పనుల్ని సీఆర్డీఏ ప్రతిపాదించింది. ప్రస్తుతం రూ.50,552 కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. రాజధానిలో 74 ప్రాజెక్టుల పనులు ప్రారంభమైనట్టు సీఎంకు అధికారులు వివరించారు. హౌసింగ్, ఇతర భవనాల నిర్మాణాలు, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలు, రోడ్లు,డక్ట్ లు లాంటి ట్రంక్ ఇన్ఫ్రా పనులు, వరద నియంత్రణ పనులు కూడా చేపట్టినట్టు వెల్లడించారు. రికార్డు టైమ్ లో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ఆదేశించారు.
Andhra Pradesh
Amaravati
Capital Construction
Chandrababu Naidu
CRDA
Infrastructure Development
రాజధాని నిర్మాణం
హౌసింగ్ ప్రాజెక్టులు
రోడ్లు
ట్రంక్ ఇన్ఫ్రా
Scroll for the next article