News27th Jun 03:27 PMSunil Byrisetty1 min read
ఏపీలో ఆకర్షణీయమైన పర్యాటక పాలసీ
క్రియేటివిటి, ప్రొడక్టివిటి, ప్రోఫెషనలిజం, ఎఫీషియన్సీ లాంటి అంశాలకు కేరాఫ్ అడ్రస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. ఆయనంత సద్గుణ సంపన్నమైన,
క్రియేటివిటి, ప్రొడక్టివిటి, ప్రోఫెషనలిజం, ఎఫీషియన్సీ లాంటి అంశాలకు కేరాఫ్ అడ్రస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. ఆయనంత సద్గుణ సంపన్నమైన, దార్శనికమైన నాయకుడు దేశంలో ఎవరూ లేరన్నారు. చంద్రబాబు చేసేంత విజన్ మరెవరూ చేయటం లేదని కచ్చితంగా చెప్పగలనన్నారు. యోగా ఆయుర్వేద, నేచురోపతి లాంటి అంశాలు పర్యాటక ప్రాంతాల్లో అవసరమని చెప్పారు. హార్సిలీ హిల్స్, అరకు, విశాఖ, రాజమహేంద్రమరం, పిచ్చుకలంక, సూర్యలంక లాంటి మంచి ప్రాంతాలు ఏపీలో ఉన్నాయని, పారిస్, స్విట్జర్లాండ్, టర్కీ లాంటి దేశాలకు పర్యాటకం కోసం వెళ్తున్నాం కానీ మనదేశంలోనే మరిన్ని అందాలున్నాయని వివరించారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో అంతకంటే సుందరమైన ప్రాంతాలు ఉన్నాయని, వీటిని అభివృద్ధి చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని బాబా రాందేవ్ పేర్కొన్నారు.