Telangana24th Aug 02:55 PMSunil Byrisetty1 min read
సురవరంకు నివాళులర్పించిన సీఎం
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. సీపీఐ అగ్రనేత సుధాకర్ రెడ్డి శనివారం మరణించారు. కమ్యూనిస్ట
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. సీపీఐ అగ్రనేత సుధాకర్ రెడ్డి శనివారం మరణించారు. కమ్యూనిస్టు పార్టీలో కార్యకర్త నుంచి అగ్రనేతగా ఎదిగిన సురవరం ఎంపీగా సేవలందించారు. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ప్రజల కోసం నిలబడి పోరాడారని, ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు.