News1st May 05:39 PMSunil Byrisetty1 min read

ఉపాధి అడిగితే.. డ్రోన్ ఇస్తానన్న సీఎం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలంలో సీఎం చంద్రబాబు నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. చలంచర్ల సుస్మితకు వితంతు పింఛన్‌ను అందించారు. టీటీసీ చదివిన సుస్మితకు డీఎస్సీ

ఉపాధి అడిగితే.. డ్రోన్ ఇస్తానన్న సీఎం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలంలో సీఎం చంద్రబాబు నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. చలంచర్ల సుస్మితకు వితంతు పింఛన్‌ను అందించారు. టీటీసీ చదివిన సుస్మితకు డీఎస్సీలో ఉద్యోగం కొరకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. సుస్మిత ఐదేళ్ల కుమార్తె చైత్రికను గురుకుల పాఠశాలలో చేర్పించి చదువు చెప్పిస్తామని హామీ ఇచ్చారు. మరో మహిళ అంకోజి సుమ తన కుమారుడికి ఉపాధి మార్గం చూపించాలని విన్నవించగా వ్యవసాయ శాఖ నుంచి డ్రోన్ అందించి శిక్షణ ఇచ్చి ఉపాధి చూపిస్తానని అన్నారు. అనంతరం కాలనీ వాసుల నుంచి పలు అర్జీలను సీఎం చంద్రబాబు నాయుడు స్వీకరించి పరిష్కారానికి హామీ ఇచ్చారు.
Nellore Atmakur
CM Chandrababu Pension Distribution
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
చంద్రబాబు నాయుడు పింఛన్లు పంపిణీ
సుస్మిత డీఎస్సీలో ఉద్యోగం కొరకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని సీఎం భరోసా
Scroll for the next article