News24th Jul 03:53 PMSunil Byrisetty1 min read
పవన్‌కు సీఎం ప్రశంసలు!
జనసేన అధినేత పవన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. కేబినెట్ సమావేశానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు. పవన్ నటించిన 'హరిహర వీరమ
జనసేన అధినేత పవన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. కేబినెట్ సమావేశానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు. పవన్ నటించిన 'హరిహర వీరమల్లు' చిత్రానికి విశేష స్పందన లభిస్తుండటం ఆనందంగా ఉందని చంద్రబాబు అన్నారు. సినిమా సూపర్ హిట్ కావాలంటూ ఆకాంక్షించారు. దీంతో చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సినిమాకు వస్తున్న స్పందనతో జనసేన నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.