News17th Jul 04:26 PMSunil Byrisetty1 min read
ఫేక్ పార్టీ వైయస్సార్సీపీ
2019లో ఆంధ్రప్రదేశ్‌లో ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందని, చంద్రబాబు బాగానే పరిపాలిస్తున్నా, జగన్‌కి ఒక్క చాన్స్ ఇస్తే ఏం చేస్తాడో చూద్దామని ప్రజలు అనుకున్నారని ముఖ్యమంత్రి నారా చంద్ర
2019లో ఆంధ్రప్రదేశ్‌లో ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందని, చంద్రబాబు బాగానే పరిపాలిస్తున్నా, జగన్‌కి ఒక్క చాన్స్ ఇస్తే ఏం చేస్తాడో చూద్దామని ప్రజలు అనుకున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో హంద్రీ- నీవా కాలువ విస్తరణ పనులకు కృష్ణా జలాలను విడుదల చేసి మాట్లాడారు. వైసీపీకి ఒక్క చాన్స్ ఇస్తే ఏదో చేస్తారనుకుంటే ప్రజలను కుమ్మి కుమ్మి, పన్నులతో బాదుడే బాదుడు చేశారని విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు ఐదు సంవత్సరాల్లో రాయలసీమ ప్రాజెక్టులకు 12500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని గుర్తు చేశారు. కులాలు, మతాలను రెచ్చగొట్టేలా గత ప్రభుత్వం రాయలసీమ గురించి మాట్లాడుతుంది కానీ కనీసం రూ. రెండు వేల కోట్లు కూడా ప్రాజెక్టుల కోసం ఇవ్వలేదని విమర్శించారు. రాయలసీమకు మంచి చేసిందెవరో ప్రజలే ఆలోచించాలన్నారు. హంద్రీ- నీవా కాలువ వెడల్పు చాలదని, 2018లో వెడల్పు పెంచి 3850 క్యూసెక్కులు ప్రవహించేలా చేసేందుకు టెండర్లు పిలిచానని వివరించారు. తర్వాత కొత్త పార్టీ అధికారంలోకి వచ్చాక టెండర్లు రద్దు చేసి 3850 కాదు పది వేల క్యూసెక్కుల నీరు ప్రవహించేలా చేస్తామని అబద్దాలు చెప్పారని గుర్తు చేశారు. కానీ పది పైసలు కూడా ఖర్చు చేయకుండా ఐదేళ్లు గడిపేసిన ఫేక్ పార్టీ వైయస్సార్సీపీ అని సీఎం చంద్రబాబు విమర్శించారు.