News17th Nov 11:45 AMSunil Byrisetty1 min read
పని చేయకపోతే ప్రశ్నించరా?
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పని చేయకపోతే ఎలా అని సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు సంస్థ
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పని చేయకపోతే ఎలా అని సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు సంస్థలు స్టీల్ ప్లాంట్లు పెట్టి లాభాల్లోకి వచ్చేస్తున్నాయి. కానీ అన్ని సదుపాయాలు, బోలెడంత చరిత్ర.. బ్రాండ్ ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కు మాత్రం నష్టాలు వస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అంతే. అందుకే చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు నిజమే కానీ.. ఇలా ఉద్యోగులు పని చేయకుండా, ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకు రాకుండా.. ఉంటే టాక్స్ పేయర్స్ మనీని తెచ్చి అందులో ఎందుకు పోస్తామని ప్రశ్నిస్తున్నారు. ఇందులో తప్పు పట్టడానికేమీ లేదు.
విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే.. ఓ ప్రత్యేకమైన బ్రాండ్. క్వాలిటీకి తిరుగులేదు. ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఎంత ఉత్పత్తి చేసినా మార్కెటింగ్ అయిపోతుంది. కానీ ఎందుకు ఆ బ్రాండ్ ను లాభాల్లోకి వచ్చేందుకు ఉపయోగించుకోవడం లేదు. అక్కడే సమస్య వస్తోంది. ఉద్యోగులు పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. ప్రతి చోటా నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారని చెబుతున్నారు.