Politics19th Jun 06:07 PMSunil Byrisetty1 min read
రాష్ట్రం కోసం పని చేయాలా? ఉన్మాదులపైనే దృష్టి పెట్టాలా?
సినిమాల్లో మనుషులను చంపేస్తారని, బయట కూడా అలా చేస్తే తప్పేమిటి, ఎవరూ అడగకూడదంటే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. సమాజంలో ఇష్టానుసారం చేస్తామంటే ఊరుకునేది లేదన్నా
సినిమాల్లో మనుషులను చంపేస్తారని, బయట కూడా అలా చేస్తే తప్పేమిటి, ఎవరూ అడగకూడదంటే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. సమాజంలో ఇష్టానుసారం చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. మా బాబాయిని చంపేసుకుంటే తప్పు లేదు, అడగడానికి మీరెవరు అంటే కుదరదన్నారు. ప్రజలు ఓట్లేసినందుకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నానని వివరించారు. కానీ కొందరు పని చేయనివ్వడం లేదని, వారికి వార్నింగ్ ఇస్తున్నానని చెప్పారు. ఏడాదిలో 25 ఎస్ఐపీబీ సమావేశాలు, 25 క్యాబినెట్ సమావేశాలు నిర్వహించామని చెప్పారు. గత పదేళ్లలో రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు క్లియర్ చేస్తే, ఈ ఏడాదిలోనే అన్ని పెట్టుబడులు క్లియర్ చేశామ’ని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.