News30th Jul 06:03 PMSunil Byrisetty1 min read
సింగపూర్ నుంచి నేరుగా రాష్ట్రానికి చంద్రబాబు
సింగపూర్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి బయల్దేరారు. నాలుగు రోజుల పాటు 26 సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యటన ముగించుకుని ఏపీకి బయల్దేరిన సీఎం చంద్
సింగపూర్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి బయల్దేరారు. నాలుగు రోజుల పాటు 26 సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యటన ముగించుకుని ఏపీకి బయల్దేరిన సీఎం చంద్రబాబుకు సింగపూర్ లోని తెలుగు ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. సీఎం ఏపీకి బయల్దేరుతున్నారని తెలిసి ఆయన బసచేసిన హోటల్ కు సింగపూర్ లోని తెలుగు ప్రజలు భారీగా తరలి వచ్చారు.
సింగపూర్ నుంచి రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ కు చేరుకోనున్న ముఖ్యమంత్రి.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెంటనే విజయవాడ బయల్దేరి రానున్నారు. రాత్రి 11.30 గంటలకు ఉండవల్లి నివాసానికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు.