News27th Oct 12:47 PMSunil Byrisetty1 min read
మోంథా తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష
మోంథా తుఫాన్‌పై ఆర్టీజీఎస్ లో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రితో ఫోన్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రధాని కార్యాలయంతో సమన్
మోంథా తుఫాన్‌పై ఆర్టీజీఎస్ లో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రితో ఫోన్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్‌కు సీఎం సూచించారు. ప్రస్తుతం కాకినాడకు 680 కి.మీ దూరంలో ఉన్న మోంథా తుఫాన్ 16 కి.మీ వేగంతో తీరాన్ని సమీపిస్తోంది. తుఫాన్ ప్రభావం వల్ల ఈరోజు, రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. రేపు రాత్రికి తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రతీ గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సమీక్షలో మంత్రులు లోకేష్, అనిత, సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.