News13th May 05:50 PMSunil Byrisetty1 min read
మరో 16 ఆలయాల్లో ప్రతినిత్యం అన్నప్రసాదం
రాష్ట్రంలో మరో 16 ప్రముఖ ఆలయాల్లో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. నెల్లూరు క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆ
రాష్ట్రంలో మరో 16 ప్రముఖ ఆలయాల్లో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు.
నెల్లూరు క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఇటీవల దేవాదాయశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశం వివరాలు, సీఎం ఆదేశాల మేరకు దేవాదాయశాఖలో అమలుచేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
ఆలయాల్లో అన్న ప్రసాదం పూర్తిస్థాయిలో జరగాలని, రోజువారీగా మెనూ తయారు చేయాలని, పరిశుభ్రమైన వాతావరణంలో వంటలు వండాలని, భక్తులకు నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు.
రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన ఏడు ఆలయాలలో అన్న ప్రసాదం వితరణ ఇప్పటికే జరుగుతుందని, మరో 16 ప్రముఖ దేవాలయాలలో కూడా అన్న ప్రసాదం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఈ మేరకు చర్యలు చేపడ్తున్నట్లు మంత్రి చెప్పారు.
అన్న ప్రసాదం వితరణ కోసం ఎంత ఖర్చవుతుందనే వివరాలు సేకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో ఒకటి రెండురోజులు మాత్రమే తెరిచే ఆలయాలు కొన్ని వున్నాయని, అందులో కందుకూరు సమీపంలోని మాలకొండ లక్ష్మీనరసింహా ఆలయం ఒకటిగా మంత్రి చెప్పారు. మాలకొండలో ఇప్పటికే ప్రతి శనివారం అన్నదానం అందిస్తున్నప్పటికీ ఇకనుంచి ఒక ప్రత్యేక కార్యక్రమంగా అన్నప్రసాదాన్ని భక్తులకు అందిస్తామని మంత్రి చెప్పారు.