News8th May 10:36 AMSunil Byrisetty1 min read
రాష్ట్రంలో స్పేస్-డిఫెన్స్ ప్రాజెక్టులకు నూతన పాలసీ
అంతరిక్ష-రక్షణ రంగాలకు సంబంధించి ప్రాజెక్టులు రాష్ట్రంలో నెలకొల్పేలా పెట్టుబడులు ఆకర్షించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఇందుకోసం సచివాలయంలో తనతో సమావేశమైన ఇస్రో
అంతరిక్ష-రక్షణ రంగాలకు సంబంధించి ప్రాజెక్టులు రాష్ట్రంలో నెలకొల్పేలా పెట్టుబడులు ఆకర్షించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు.
ఇందుకోసం సచివాలయంలో తనతో సమావేశమైన ఇస్రో మాజీ చైర్మన్, ప్రస్తుతం రాష్ట్రానికి స్పేస్ టెక్నాలజీ అడ్వయిజర్‌గా ఉన్న ఎస్ సోమనాథ్, అలాగే మాజీ డీఆర్డీఓ చైర్మన్, ప్రస్తుత రాష్ట్ర ఏరోస్పేస్-డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ సలహాదారు డాక్టర్ జి. సతీష్ రెడ్డితో చర్చించారు.
స్పేస్-డిఫెన్స్ పాలసీల రూపకల్పనతో పాటు... ఈ రెండు రంగాలకు సంబంధించి రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు పొందేలా చురకైన పాత్ర పోషించాలని ఇరువురికి ముఖ్యమంత్రి సూచించారు.
విద్యార్ధులు స్పేస్, డిఫెన్స్ రంగాల వైపు ఆకర్షితులయ్యేలా ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
ముఖ్యమంత్రితో సమావేశంలో సోమనాథ్, సతీష్ రెడ్డి.. స్పేస్-డిఫెన్స్ రంగాల అభివృద్ధిపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
అనంతరం ఇరువురిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్కరించారు.