News11th Dec 03:18 PMSunil Byrisetty1 min read

కేబినెట్ సమావేశంలో మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు

కేబినెట్ సమావేశంలో మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఇన్చార్జ్ మంత్రులు తన దృష్టికి తీసుకురావాలన్నారు. మంత్రుల పనితీరు సమీక్షించే పరిస్థితి

కేబినెట్ సమావేశంలో మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు
కేబినెట్ సమావేశంలో మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఇన్చార్జ్ మంత్రులు తన దృష్టికి తీసుకురావాలన్నారు. మంత్రుల పనితీరు సమీక్షించే పరిస్థితి రాకూడదన్నారు. పరిశ్రమల ఏర్పాటు, స్థానిక సమస్యల పరిష్కార బాధ్యత ఎమ్మెల్యేలతో కలిసి రావాలని సూచించారు. ఏడాదిలోగా రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం ఇళ్లకు కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టని వాటిని సమీక్షించాలన్న సీఎం.. నిరుపయోగంగా ఉన్న కాలనీలపై తదుపరి నిర్ణయానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పాత నిబంధనలు రద్దు చేసి మరింత మెరుగ్గా ఇళ్ల కేటాయించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Cabinet Meeting
Ministers
Governance
Revenue Issues
Housing
Local Development
Industrial Growth
విధాన సమీక్ష
ఏపీ రాజకీయాలు
ప్రజా సంక్షేమం
ప్రభుత్వ కార్యక్రమాలు
Scroll for the next article