News26th Oct 05:15 PMSunil Byrisetty1 min read
ఆర్నబ్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆర్నబ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్నబ్ తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు తీసు
ఆర్నబ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్నబ్ తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. తుపాను ప్రభావానికి అనుగుణంగా ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఆస్తి, ప్రాణ నష్టం జరక్కుండా చూడాలని సీఎం సూచనలు చేశారు. తుపాను ప్రభావంతో కురిసే వర్షాలు, గాలులు వరద ప్రవాహాల తీవ్రతను అంచనా వేస్తూ తగిన చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. గతంలో వచ్చిన తుపాన్ల సమాచారాన్ని విశ్లేషిస్తూ రైతులకు, ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరించాలని సూచించారు. తీరప్రాంతాల ప్రజల్ని తుపాను షెల్టర్లకు తరలించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.