News28th Oct 12:00 PMSunil Byrisetty1 min read

అర్నబ్, సహయక చర్యలపై సీఎం టెలీకాన్ఫరెన్స్

తుఫాన్ సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు, ఉద్యోగులు, క్షేత్ర

అర్నబ్, సహయక చర్యలపై సీఎం టెలీకాన్ఫరెన్స్
తుఫాన్ సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు, ఉద్యోగులు, క్షేత్ర స్థాయి సిబ్బంది రాత్రంతా అద్భుతంగా పని చేశారన్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ప్రాణనష్టం సంభవించ లేదని పేర్కొన్నారు. అధికార యంత్రాంగం ముందస్తుగా తీసుకున్న చర్యల వల్లే ప్రాణనష్టం జరగకుండా చూసుకోగలిగామని తెలిపారు. ఆస్తి నష్టం వీలైనంత మేర తగ్గించేందుకు కృషి చేయాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను సిద్దంగా ఉంచుకోవాలన్నారు.
Scroll for the next article