News28th Oct 12:24 PMSunil Byrisetty1 min read
సెక్రటేరియేట్ చేరుకున్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు సెక్రటేరియట్ చేరుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితిని ఆర్టీజీఎస్ నుంచి పరిశీలించారు. •అర్నబ్ తుఫాన్ గమనాన్ని ప్రస్తుతం క్షేత
ముఖ్యమంత్రి చంద్రబాబు సెక్రటేరియట్ చేరుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితిని ఆర్టీజీఎస్ నుంచి పరిశీలించారు.
•అర్నబ్ తుఫాన్ గమనాన్ని ప్రస్తుతం క్షేత్రస్థాయిలోని పరిస్థితిని ఆర్టీజీఎస్ అధికారులు వివరించారు.
వివిధ ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారులతో పాటు ఇతర చోట్లా ఏమైనా చెట్లు విరిగిపడితే వెంటనే తొలగించి రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. మనమిత్ర యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు చేరవేయడంతో పాటు సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నట్టు సీఎంకు వివరించారు.