News28th Oct 01:20 PMSunil Byrisetty1 min read

జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అనగాని, నారాయణ, నాదెండ్ల, సత్యకుమార్, అనిత

జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అనగాని, నారాయణ, నాదెండ్ల, సత్యకుమార్, అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి హాజరయ్యారు. ప్రజల అవసరాలు, పాలనా సౌలభ్యం ప్రధాన అజెండాగా జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై ప్రభుత్వం ఆలోచనలపై చర్చ జరిపారు. గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగిందని, ఆ తలెత్తిన ఇబ్బందులను సరిదిద్దే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సమాలోచన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అందిన అర్జీలు, ప్రజల అవసరాలు, సౌకర్యం, ఎన్నికల సమయంలో హామీలపైనా చర్చ జరిపారు.
Andhra Pradesh
Chandrababu Naidu
District Reorganization
Pawan Kalyan
AP Government
Cabinet Meeting
మంత్రివర్గ సమావేశం
పరిపాలనా సంస్కరణలు
రెవెన్యూ డివిజన్లు
Scroll for the next article