Farmers28th Jul 04:12 PMSunil Byrisetty1 min read

ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, రైతుల్లో కల్పించాల్సిన అవగాహనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జూలై నెలలో పడాల్సిన వర్షం కన్నా 69 శాత

ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, రైతుల్లో కల్పించాల్సిన అవగాహనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జూలై నెలలో పడాల్సిన వర్షం కన్నా 69 శాతం లోటు నమోదైంది. రాబోయే మూడు నెలల్లో సరాసరి 35 నుంచి 40 శాత మేర లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో అంచనాలకు మించి ఎల్‌నినో ప్రభావం ఉండబోతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి బేసిన్లలో ఎగువ రాష్ట్రాల నుంచి జలాలు వచ్చే అవకాశంపై సీఎం ఆరా తీశారు. అన్ని జిల్లాల్లోనూ ఎల్‌నినో ప్రభావం చూపిస్తోందని, ఎక్కువగా పశ్చిమ గోదావరి, ప్రకాశం, అన్నమయ్య, కృష్ణా, కడప జిల్లాల్లో వర్షాభావ పరిస్థితిలు నెలకొంటాయని అధికారులు వివరించారు. 2.78 లక్షల హెక్టార్లలో పత్తి, 1.07 లక్షల హెక్టార్లలో వరిపై ప్రభావం చూపిస్తుందని అంచనాలున్నాయి. రాష్ట్రంలో 122 హై రిస్క్ మండలాలను గుర్తించగా వాటిలో బోరు ఆధారంగా పంటలను కాపాడుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు.
Andhra Pradesh
Rainfall Deficit
Drought
N Chandrababu Naidu
El Niño
Farmers
Agriculture
Crop Damage
Krishna Basin
గోదావరి బేసిన్
నీటి వనరులు
పత్తి పంట
వరి పంట
హై రిస్క్ మండలాలు
Scroll for the next article