News21st Nov 03:24 PMSunil Byrisetty1 min read

వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్శల్ హెల్త్ స్కీం చర్చ జరిగింది. సంజీవని ప్రాజెక్టు

వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్శల్ హెల్త్ స్కీం చర్చ జరిగింది. సంజీవని ప్రాజెక్టు స్కీంను జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు. పీపీపీ ప్రాతిపదికన తొలివిడతలో చేపట్టనున్న ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణంపై చర్చ జరిగింది. పీపీపీ విధానంలో వేగంగా బోధనాసుపత్రులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Medical and Health Department
Sanjeevani Project
Universal Health Scheme
Health Review
Chittoor District
PPP Model Medical Colleges
ఆదోని మెడికల్ కాలేజీ
మదనపల్లి మెడికల్ కాలేజీ
మార్కాపురం మెడికల్ కాలేజీ
Scroll for the next article