News17th Oct 02:35 PMSunil Byrisetty1 min read

గనుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమలు అవుతున్న ఉచిత ఇసుక విధానంపై సమీక్షలో చర్చించారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గనుల శాఖ ద్వారా

గనుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమలు అవుతున్న ఉచిత ఇసుక విధానంపై సమీక్షలో చర్చించారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గనుల శాఖ ద్వారా రూ.3320 కోట్ల ఆదాయార్జన లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గతం కంటే 34 శాతం మేర అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వస్తుందని సీఎంకు తెలిపారు. మాంగనీస్ లాంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో 72 శాతానికి పైగా అదనపు ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖేష్ కుమార్ మీనా, ప్రవీణ్ కుమార్, ఆర్టీజీ అధికారులు హాజరయ్యారు.
Andhra Pradesh
CM Chandrababu
Mines Department
Revenue Target
Minerals
Government Review
Manganese
Economic Growth
State Administration
గనుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
Scroll for the next article