News14th Aug 03:06 PMSunil Byrisetty1 min read
పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష
పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయనున్న 36 ప్రాజెక్టులు, రాష్ట్రంలోని రిజర
పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయనున్న 36 ప్రాజెక్టులు, రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారు. లోటు వర్షపాతం, భూగర్భ జలాలు, తాగు నీటి సరఫరా, నిర్వహణా ప్రణాళిక, జలధార- జలహారతి కార్యక్రమాల అమలుపై దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టులో నిన్నటి వరకూ 89.9 శాతం మేర సివిల్ పనులు పూర్తైనట్టు అధికారులు తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి అవుతున్నట్టు సీఎంకు వెల్లడించారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్-1,గ్యాప్-2లో పనులు శరవేగంగా చేపట్టినట్టు అధికారులు తెలిపారు. డ్యామ్ సైట్ వద్ద రోడ్ల లాంటి మౌలిక వసతుల పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచించారు.