News16th Jul 01:12 PMSunil Byrisetty1 min read
పీపీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. పోర్టులు, షిప్ యార్డులు, ఎయిర్ పోర్టులు, పర్యాటక ప్రాజెక్ట
రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. పోర్టులు, షిప్ యార్డులు, ఎయిర్ పోర్టులు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. పరిశ్రమలు, మౌలికసదుపాయాలు, పురపాలక, టూరిజం, వైద్య కళాశాలలు రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో పురోగతిలో రూ.1,23,229 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టనుంది. పీపీపీ ప్రాజెక్టులను సస్టైనబుల్ మోడల్ లో అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
సమీక్షకు ఆర్ధికశాఖా మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.