News14th Nov 04:55 PMSunil Byrisetty1 min read

రయ్యిమంటూ తిరగనున్న డ్రోన్ ట్యాక్సీలు

ఏపీలో డ్రోన్ ట్యాక్సీలు నడపనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. త్వరలో రాష్ట్రంలో డ్రోన్ ట్యాక్సీ

రయ్యిమంటూ తిరగనున్న డ్రోన్ ట్యాక్సీలు
ఏపీలో డ్రోన్ ట్యాక్సీలు నడపనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. త్వరలో రాష్ట్రంలో డ్రోన్ ట్యాక్సీలు అభివృద్ధి చేస్తామని తెలిపారు. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు కేంద్రం సాయం అందించాలని కోరారు. విశాఖ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు, పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ వేదికపై సీఎం డ్రోన్ ట్యాక్సీల గురించి పేర్కొన్నారు.
Andhra Pradesh Development
Drone Taxis
CM Chandrababu Naidu
Drone City
Space City
CII Summit
Green Hydrogen Valley
పీయూష్ గోయల్
నూతన సాంకేతికత
Scroll for the next article