News7th Aug 09:00 AMSunil Byrisetty1 min read

నాయీ బ్రాహ్మణులకు తీపి కబురు

కూటమి ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన మరో హమీని నెరవేర్చింది. అర్హులైన నాయీ బ్రాహ్మణులందరికీ ఉచిత విద్యుత్ ను 150 నుంచి 200 యూనిట్లకు పెంచుతూ కేబినెట్ భేటీలో ఆమోదించింది. గడిచిన

నాయీ బ్రాహ్మణులకు తీపి కబురు
కూటమి ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన మరో హమీని నెరవేర్చింది. అర్హులైన నాయీ బ్రాహ్మణులందరికీ ఉచిత విద్యుత్ ను 150 నుంచి 200 యూనిట్లకు పెంచుతూ కేబినెట్ భేటీలో ఆమోదించింది. గడిచిన ఎన్నికల్లో నాయీ బ్రాహ్మణుల కష్టాలను గుర్తించిన సీఎం చంద్రబాబు ఉచిత విద్యుత్ ను 200 యూనిట్ల వరకూ అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో నాయీ బ్రాహ్మణులందరికీ ఉచిత విద్యుత్ ను 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచుతూ మంత్రిమండలి సభ్యులు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కేటగిరీ-II సర్వీస్ కింద 40,808 సెలూన్ షాపులు గుర్తింపు పొందాయి. ఈ షాపులన్నింటికీ నెలకు 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ అందించనున్నారు. నాయీ బ్రాహ్మణులకు అందించే ఉచిత విద్యుత్ వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.100.20 కోట్లు భారం పడుతుంది. నాయీబ్రాహ్మణులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు.
Andhra Pradesh news
Free Electricity Scheme
Nayee Brahmin Welfare
AP Cabinet Decisions
200 Units Free Power
Salon Shops Electricity
నాయీ బ్రాహ్మణులకు మద్దతు
విద్యుత్ సబ్సిడీ పథకం
Scroll for the next article