News3rd Nov 12:50 PMSunil Byrisetty2 min read

మీకు అలర్ట్ వచ్చిందా!

సోమవారం రాత్రి మీ ఫోన్ మోగినప్పుడు, ఒక్క క్షణం గుండె ఝల్లుమని ఉంటుంది. "మురసు తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది, అప్రమత్తంగా ఉండండి" అనే సందేశం. ఆ రాత్రి లక్షలాది కుటుంబాలు కిటికీలు మ

మీకు అలర్ట్ వచ్చిందా!
సోమవారం రాత్రి మీ ఫోన్ మోగినప్పుడు, ఒక్క క్షణం గుండె ఝల్లుమని ఉంటుంది. "మురసు తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది, అప్రమత్తంగా ఉండండి" అనే సందేశం. ఆ రాత్రి లక్షలాది కుటుంబాలు కిటికీలు మూసుకుని, టార్చ్‌లైట్లు వెతుక్కుని, ప్రతి గాలి శబ్దానికీ ఉలిక్కిపడ్డాయి. కానీ అదే రాత్రి, అమరావతిలో మరో లైట్ వెలుగుతూనే ఉంది. ఒక పెద్దాయన కూడా నిద్రపోలేదు. ఆదివారం రాత్రి 10 గంటలకు మొదలైన టెలికాన్ఫరెన్స్, సోమవారమంతా ఆర్టీజీఎస్‌లో కొనసాగిన సమీక్ష, మూడు టెలికాన్ఫరెన్స్‌లు, రాత్రంతా గంటకోసారి సమాచారం. చివరకు తెల్లవారుజామున 3:30కి మళ్లీ కలెక్టర్లతో మాట్లాడారు. తుఫాన్ తీరాన్ని తాకిన రెండున్నర గంటల తర్వాత కూడా ఆయన ఫోన్ కింద పెట్టలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగిన ప్రశ్నలు చూడండి. విద్యుత్ స్తంభాలు పడ్డాయా? సబ్‌స్టేషన్ల పరిస్థితి ఏమిటి? ప్రజలు రోడ్లపైకి రాకుండా చూశారా? ఉపన్యాసాలు కావు. ఒక ఇంటి పెద్ద, తన ఇంటివాళ్లందరూ క్షేమంగా ఉన్నారా అని ప్రతి గదిలోకీ తొంగి చూసినట్టే ఉన్నాయి. ఈ ఉదయం కొత్తపట్నం తీరం దాటిన తుఫాన్ వెనుక ఒక చిన్న ఊరట కనిపిస్తోంది. ఎక్కడా విద్యుత్ స్తంభం కూలలేదు, సరఫరా ఆగలేదు. బాపట్లలో రెండు చెట్లు, నెల్లూరులో ఏడు, ఒంగోలులో ఐదు కూలినా, వెంటనే తొలగించారు. మొగల్రాజపురంలో కొండచరియలు విరిగే ప్రమాదం ఉందని ముందే కుటుంబాలను శిబిరాలకు తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కన్నా, జరగకముందే ఆపడమే అసలైన పాలన. ఇక్కడ ఒక విషయం మనం మర్చిపోకూడదు. ఈ కథలో హీరోలు ముఖ్యమంత్రి ఒక్కరే కాదు. వర్షంలో తడుస్తూ రోడ్డుపై పడిన చెట్టును తొలగించిన మున్సిపల్ కార్మికుడు, చీకట్లో స్తంభం పక్కనే నిలబడిన విద్యుత్ సిబ్బంది, శిబిరాల్లో పిల్లలకు పాలు అందించిన సచివాలయ ఉద్యోగి, అలసిన కళ్లతో కలెక్టర్‌కు సమాచారం అందించిన తహసీల్దార్. వీరందరినీ ఒక్క తాటిపై నడిపించే ఫోన్ కాల్ నాయకత్వం. ఆ కాల్ ఎంత సమయానికి వస్తుంది, ఎంత తరచుగా వస్తుంది అనేదే క్షేత్రస్థాయిలో ధైర్యాన్ని నిర్ణయిస్తుంది.
Scroll for the next article