News7th Oct 04:29 PMSunil Byrisetty1 min read

జగనన్న కాలనీలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

మంత్రివర్గ భేటీ ముగిశాక తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. గతంలో కేటాయించిన జగనన్న కాలనీలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. జగనన్న కాలనీల్లో ఇల్లు కట్ట

జగనన్న కాలనీలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
మంత్రివర్గ భేటీ ముగిశాక తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. గతంలో కేటాయించిన జగనన్న కాలనీలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. జగనన్న కాలనీల్లో ఇల్లు కట్టుకుంటామంటే ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ప్లాట్లు దక్కిన వారు తమకు అక్కర్లేదంటే మరో ప్రాంతంలో ఇవ్వాలని సీఎం సూచించారు. జగనన్న కాలనీల్లో ఖాళీ ప్లాట్లు ఉంటే ఇతరులకు కేటాయించాలన్న సీఎం కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కర్మయోగి కార్యక్రమంలో భాగంగా సిబ్బందికి మంత్రులు శిక్షణ ఇవ్వాలన్న సీఎం స్వయం ఉపాధి గ్రూప్‌ల వద్ద రూ.30 వేల కోట్ల కార్పస్ నిధులున్నాయని పేర్కొన్నారు. మిగతా గ్రూప్‌లను కూడా అదే విధంగా తయారుచేయాలని ఆదేశించారు. మోదీ తాను చేపట్టిన కార్యక్రమాలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని, ప్రధానిగా ఉండి కూడా మోదీ అందరు చెప్పిన విషయాలు వింటారని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. మంత్రులు కూడా ప్రజలు చెప్పిన విషయాలు వినాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Scroll for the next article