News17th Jul 12:27 PMSunil Byrisetty1 min read

రేపు గుడివాడలో స్వచ్ఛ భారత్.. సీఎం హాజరు

గుడివాడలో శనివారం స్వచ్ఛ భారత్ జరగనుంది. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. తొలుత మదనపల్లిలో స్వచ్ఛ భారత్ నిర్వహించాలని నిర్ణయించి, 70 శాతం వరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశ

రేపు గుడివాడలో స్వచ్ఛ భారత్.. సీఎం హాజరు
గుడివాడలో శనివారం స్వచ్ఛ భారత్ జరగనుంది. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. తొలుత మదనపల్లిలో స్వచ్ఛ భారత్ నిర్వహించాలని నిర్ణయించి, 70 శాతం వరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే హఠాత్తుగా గుడివాడకు మార్చడంతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ముమ్మర సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ బాలాజీ సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన విజయవంతానికి గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కలెక్టర్ డీకే బాలాజీ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భద్రత, ట్రాఫిక్, ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొని పర్యటన ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సీఎం పర్యటనను ప్రజా ఉత్సవంగా నిర్వహిస్తామని, అధికారుల సమన్వయంతో కూటమి నాయకత్వం పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతుందని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు.
Andhra Pradesh
AP Government
Chandrababu Naidu
Swachh Bharat
Gudivada
Clean India Mission
డీకే బాలాజీ
వెనిగండ్ల రాము
పరిశుభ్రత కార్యక్రమం
అధికారులు
Scroll for the next article