News17th Dec 09:57 AMSunil Byrisetty1 min read
నేడు కలెక్టర్ల సదస్సు
ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఈరోజు ఉదయం పది గంటలకు ప్రారంభం కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి
ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఈరోజు ఉదయం పది గంటలకు ప్రారంభం కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. తొలిరోజు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ), కీలక పనితీరు సూచికలు (కేపీఐఎస్), అభివృద్ధి లక్ష్యాలపై ప్రధానంగా చర్చించనున్నారు. సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయిని అంచనా వేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగంపై సీఎం సమీక్షిస్తారు.
రెండో రోజైన గురువారం వివిధ జిల్లాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలు, సక్సెస్ స్టోరీస్‌పై కలెక్టర్లు ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం నుంచి డీజీపీ, జిల్లాల ఎస్పీలతో శాంతి భద్రతల అంశంపై సీఎం ప్రత్యేకంగా సమీక్షిస్తారు.