News24th Nov 11:15 AMSunil Byrisetty1 min read
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమావేశం
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మంత్రులతో ఆయన సమావేశమవుతారు. ఈ సమావేశంలో మార
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మంత్రులతో ఆయన సమావేశమవుతారు. ఈ సమావేశంలో మార్కాపురం, మదనపల్లె వంటి కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రజల అభ్యంతరాలను సేకరించిన మంత్రుల కమిటీ ప్రతిపాదనపై నేడు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లాల పునర్విభజన ఉండనుంది. అలాగే ఆయా కొత్త జిల్లాల పేర్లపైనా చర్చించనున్నారు.