Farmers31st Jul 06:13 PMSunil Byrisetty1 min read

దర్శిలో సీఎం 'అన్నదాత సుఖీభవ' విడుదల

రాష్ట్రంలోని రైతులందరికీ సంక్షేమాన్ని అందించే పథకానికి ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది. ‘అన్నదాత సుఖీభవ’ పథకం తొలి విడత నిధుల విడు

దర్శిలో సీఎం 'అన్నదాత సుఖీభవ' విడుదల
రాష్ట్రంలోని రైతులందరికీ సంక్షేమాన్ని అందించే పథకానికి ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది. ‘అన్నదాత సుఖీభవ’ పథకం తొలి విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. సూపర్‌ సిక్స్‌లో కీలక హామీ అయిన అన్నదాత సుఖీభవ పథకంను ఆగస్ట్ 2న ప్రకాశం జిల్లా దర్శిలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రూ. 7 వేలను తొలి విడత సాయం కింద రాష్ట్రంలో అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలలో ప్రభుత్వం జమ చేయనుంది. అలానే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ యోజన నిధులు కూడా జమ కానున్నాయి. రాష్ట్రంలోని 46 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బును ప్రభుత్వం జమ చేయనుంది.
Andhra Pradesh
Annadata Sukhibhava
Chandrababu Naidu
farmer welfare
PM Kisan Yojana
agriculture scheme
Prakasam district
అన్నదాత సుఖీభవ
చంద్రబాబు
రైతు సంక్షేమం
Scroll for the next article