News5th Sep 11:10 AMSunil Byrisetty1 min read

ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు భేటీ

అమరావతిలో ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంప్ ఆఫీస్ లో సమావేశమై PRC కమిషన్ ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే పెండింగ్ డీఏలు,

ఉద్యోగ సంఘాలతో  సీఎం చంద్రబాబు భేటీ
అమరావతిలో ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంప్ ఆఫీస్ లో సమావేశమై PRC కమిషన్ ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే పెండింగ్ డీఏలు, పెండింగ్ బకాయిలపై చర్చించనున్నారు. మరోవైపు ఎన్నికల హామీల అమలుపై ఉద్యోగ సంఘాల ఆశలు పెట్టుకున్నాయి. జీతాల బకాయిలు, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్ పై చర్చించాలని కోరుతున్నారు. టీచర్స్ డే రోజే ఉద్యోగులతో సీఎం భేటీ కానుండటంతో సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది. అమరావతి జేఏసీ నేతలు ఆందోళన బాట పట్టి, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న విషక్ష్ం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంతో భేటీతో కీలక అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Andhra Pradesh
Chandrababu Naidu
Employee Unions
Amaravati JAC
PRC Commission
Pay Revision Commission
Pending DA
DA Arrears
జీతాల బకాయిలు
మెడికల్ బిల్లులు
సరెండర్ లీవ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
టీచర్స్ డే
అమరావతి
Scroll for the next article