News29th Sep 09:50 AMSunil Byrisetty1 min read
పవన్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ
తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. ఆరోగ్య
తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. జ్వరం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ అంశంపై డిప్యూటీ సీఎంతో చర్చించారు. జీఎస్టీ 2.0 సంస్కరణలలో భాగంగా రాష్ట్రంలో చేపట్టనున్న జీఎస్టీ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహణపైనా చర్చించారు. వచ్చే నెల 16వ తేదీన ప్రధాని మోదీ శ్రీశైలం రానున్న సందర్భంగా రోడ్ షో నిర్వహణ విజయంతం చేసే అంశంపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. వీటితో పాటు డీఎస్సీ అంశం కూడా ఇద్దరు నేతల మధ్య చర్చకు వచ్చింది. మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి ఒకేసారి 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.