News12th Aug 11:38 AMSunil Byrisetty1 min read

శాంతిభద్రతలపై సీఎం సమీక్ష

రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 03:30 గంటలకు సచివాలయంలో హై లెవల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్

శాంతిభద్రతలపై సీఎం సమీక్ష
రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 03:30 గంటలకు సచివాలయంలో హై లెవల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు 1,300 మంది పోలీస్ అధికారులు హాజరు కావాలని ఆదేశించారు. శాంతిభద్రతలు, మహిళలు-చిన్నారులపై నేరాల కట్టడి, సైబర్ క్రైమ్‌పై సీఎం చంద్రబాబు సమీక్షలో చర్చిస్తారు. సోషల్ మీడియా సైకోలు, బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఆగడాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పోలీస్ స్టేషన్ల పనితీరు, కేసుల నమోదుపై క్షేత్రస్థాయి నివేదికలతో సమీక్ష నిర్వహిస్తారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఉక్కుపాదం మోపాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. మహిళలు, బలహీన వర్గాల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయనున్నారు.
Andhra Pradesh police
Chandrababu Naidu
Law and Order
Police Review
High-Level Meeting
DGP
Police Officials
Crime Control
మహిళల భద్రత
చిన్నారుల భద్రత
పోలీస్ స్టేషన్లు
నేర నియంత్రణ
సోషల్ మీడియా నేరాలు
Scroll for the next article