News29th Sep 05:52 PMSunil Byrisetty1 min read

సీఎం.. వారమంతా బిజీ బిజీ

ముఖ్యమంత్రి చంద్రబాబు వారం రోజులపాటు బిజీ షెడ్యూల్‌తో విస్తృతంగా పర్యటించనున్నారు. అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణల కలయికగా రూపొందించిన ఈ కార్యాచరణను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంట

సీఎం.. వారమంతా బిజీ బిజీ
ముఖ్యమంత్రి చంద్రబాబు వారం రోజులపాటు బిజీ షెడ్యూల్‌తో విస్తృతంగా పర్యటించనున్నారు. అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణల కలయికగా రూపొందించిన ఈ కార్యాచరణను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటూ, ఒక వారం పాటు ఇంటికెళ్లకుండా జిల్లాల పర్యటనలతో షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ప్రజల ముందుకు రావడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని అని ట్వీట్ చేశారు. ఒకవైపు గ్రామీణాభివృద్ధి, మరోవైపు అత్యాధునిక మౌలిక వసతుల కల్పనపై ఆయన ఏకకాలంలో దృష్టి సారిస్తున్నారు. ఉదయగిరి వేదికగా రూ.11,000 కోట్ల భారీ నిధులతో పల్లె పండుగ 3.0 గ్రామీణ అభివృద్ధి పనుల శ్రీకారం మొదలుకొని, విజయవాడలో 25,000 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, తెనాలిలో 3 లక్షల గ్రామీణ ఇళ్ల కేటాయింపు వరకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికితోడు ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరందించే జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను వేగవంతం చేస్తూ గ్రామసీమల రూపురేఖలు మార్చేందుకు క్షేత్రస్థాయిలోకి స్వయంగా దిగుతున్నారు. సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకే చేర్చాలన్న తపనతో రేపల్లెలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటున్నారు. పారిశ్రామిక, సాంకేతిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు మదనపల్లెలో రాయలసీమ హబ్ డెవలప్‌మెంట్ సదస్సు, ఉన్నత సాంకేతికతకు దిక్సూచిగా నిలిచే పాన్ ఐఐటీ అభివృద్ధి సమావేశాల్లో పాల్గొననున్నారు.
Scroll for the next article