News13th Oct 11:34 AMSunil Byrisetty1 min read
గల్ఫ్ దేశాల్లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గల్ఫ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈనెల 24న గల్ఫ్ టూర్‌కు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబిలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రవాసాంధ్రు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గల్ఫ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈనెల 24న గల్ఫ్ టూర్‌కు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబిలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రవాసాంధ్రులతో జరిగే ప్రత్యేక సమావేశంలో P4 కార్యక్రమం గురించి వివరించడంతోపాటు పెట్టుబడులపై చర్చించనున్నారు. ఈ మేరకు సీఎం టూర్కు కేంద్రం అనుమతిచ్చింది. ప్రవాసులతో భేటీకి అవసరమైన సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది.