News15th Dec 11:09 AMSunil Byrisetty1 min read
శంషాబాద్‌లోని కన్హా శాంతివనానికి సీఎం చంద్రబాబు
శంషాబాద్‌లోని కన్హా శాంతివనం వ్యవస్థాపకులు దాజీ నివాసానికి వెళ్లి దాజీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. వెల్‌నెస్, మెడిటేషన్ సెంటర్, యోగా, ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫా
శంషాబాద్‌లోని కన్హా శాంతివనం వ్యవస్థాపకులు దాజీ నివాసానికి వెళ్లి దాజీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. వెల్‌నెస్, మెడిటేషన్ సెంటర్, యోగా, ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్ కేంద్రాన్ని, బయోచార్ కేంద్రాన్ని, గోపీచంద్ స్టేడియం, హార్ట్‌ఫుల్‌నెస్ స్కూల్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం అమరావతి చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. 2.30 గంటలకు ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం 3.30 గంటలకు ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఆర్టీజీఎస్‌లో పథకాల అమలు తీరుపై చర్చిస్తారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణదినం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.