News11th Jan 11:31 AMSunil Byrisetty1 min read

రేపు నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నారావారిపల్లెకు వెళ్లనున్నారు. సంక్రాంతి సందర్భంగా 12 నుంచి 15 వరకు స్వగ్రామంలో పండుగ వేడుకల్లో పాల్గొంటారు. ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం తన స్వగ్రామమైన నారావారి పల్లె

రేపు నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు నారావారిపల్లెకు వెళ్లనున్నారు. సంక్రాంతి సందర్భంగా 12 నుంచి 15 వరకు స్వగ్రామంలో పండుగ వేడుకల్లో పాల్గొంటారు. ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం తన స్వగ్రామమైన నారావారి పల్లెకు వెళ్లనున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకోనున్నారు. నాలుగు రోజుల పాటు సొంత గ్రామంలో సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. రూ. 140 కోట్లతో పలు పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.20 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
Andhra Pradesh CM
TDP
Development Works
CM Chandrababu Naidu
Naravaripalle
Sankranti Celebrations
అభివృద్ధి పనులు
శంకుస్థాపనలు
Scroll for the next article