News13th Jul 10:35 AMSunil Byrisetty1 min read
నేడు పోలవరం, కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణ పనులను ప్రారంభించి, రూ.152.95 కోట్లతో చేపడుతున్న 117 కొ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణ పనులను ప్రారంభించి, రూ.152.95 కోట్లతో చేపడుతున్న 117 కొత్త గేట్ల ఏర్పాటు, హెడ్ స్లూయిజ్ గేట్ల మరమ్మతులు, రబ్బరు సీల్స్, రోలర్ బేరింగ్స్, వైర్ రోప్స్, ఎలక్ట్రికల్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం పిచ్చుకలంక గ్రామంలో కొత్తపేట నియోజకవర్గ రైతులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టుకు చేరుకుని ఈసీఆర్ఎఫ్ గ్యాప్-2 పనులు, పవర్ హౌస్ నిర్మాణాలను పరిశీలించనున్నారు. అలాగే ప్రాజెక్టు పురోగతిపై అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు.