News1st Aug 06:09 PMSunil Byrisetty1 min read

ఆటో ఎక్కి.. ప్రజావేదికకు.. వినూత్నంగా సీఎం చంద్రబాబు!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా జమ్మలమడుగు పర్యటనలో వినూత్న రీతిలో ప్రయాణించారు. జమ్మలమడుగులో నిర్వహించిన ప్రజావేదిక వద్దకు ముఖ్యమంత్రి ఆటోలో చేరుకున్నారు. 'పేదల సేవలో

ఆటో ఎక్కి.. ప్రజావేదికకు.. వినూత్నంగా సీఎం చంద్రబాబు!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా జమ్మలమడుగు పర్యటనలో వినూత్న రీతిలో ప్రయాణించారు. జమ్మలమడుగులో నిర్వహించిన ప్రజావేదిక వద్దకు ముఖ్యమంత్రి ఆటోలో చేరుకున్నారు. 'పేదల సేవలో' పేరుతో జరుగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా బాబు చేసిన ప్రయాణం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఓ వితంతు పెన్షన్ లబ్ధిదారైన అలివేలమ్మను ఆమె ఇంటికి వెళ్లి స్వయంగా కలిశారు. ఆమె కుటుంబ సభ్యులతోపాటు ఇంట్లోని పరిస్థితులను కూడా స్వయంగా చూసి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిని ఆప్యాయంగా ఆహ్వానించిన అలివేలమ్మ తనకు ఇద్దరు కొడుకులు ఉన్నారని, చిన్న కొడుకు జగదీష్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తుండగా, పెద్ద కొడుకు వేణుగోపాల్ తనలాగే చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాడని తెలిపారు. ఆమె తన చిన్న కుమారుడైన జగదీష్‌కు ప్రభుత్వ శాఖల్లో డ్రైవర్ పోస్టును కల్పించాల్సిందిగా కోరారు. ఈ మేరకు అవసరమైన అన్ని సహాయాలు ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
Andhra Pradesh news
Chandrababu Naidu
Jammalamadugu Visit
Pension Distribution
Auto Ride by CM
చంద్రబాబు
జమ్మలమడుగు
పెన్షన్ కార్యక్రమం
Scroll for the next article