News4th Oct 04:44 PMSunil Byrisetty1 min read

త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీ పరిశీలన

తెనాలిలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టును సందర్శించారు. సీబీఆర్ఐ అధికారులు వారికి త్రీడీ టెక్

త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీ పరిశీలన
తెనాలిలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టును సందర్శించారు. సీబీఆర్ఐ అధికారులు వారికి త్రీడీ టెక్నాలజీ నిర్మాణ ప్రక్రియ గురించి వివరించారు. కేవలం 10 రోజుల్లో ఒక ఇంటిని ఈ సాంకేతికతో నిర్మించే అవకాశముందని తెలిపారు. అనంతరం ఇరువురు నేతలూ ఓ లబ్దిదారు కుటుంబానికి చెందిన ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూమి పూజ చేసిన అనంతరం లబ్దిదారు కుటుంబంతో ఆప్యాయంగా మాట్లాడి వారికి నూతన వస్త్రాలను బహూకరించారు. అనంతరం 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సూచికగా శిలాఫలకం ఆవిష్కరించి అక్కడికి సమీపంలోనే మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం వేదికపై లక్ష్మీ అనే మహిళకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంటి పట్టాన అందించారు.
Scroll for the next article