News30th Oct 01:21 PMSunil Byrisetty1 min read

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గురువారం ముమ్మిడివరంలో పర్యటించిన ముఖ్యమంత్రి రెండో రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించే నిమిత్తం కాసేపట్లో మొగల్తూరు

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గురువారం ముమ్మిడివరంలో పర్యటించిన ముఖ్యమంత్రి రెండో రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించే నిమిత్తం కాసేపట్లో మొగల్తూరు చేరుకున్నారు. మొగల్తూరు, నరసాపురం మండలాల్లోని పలు గ్రామాల్లో నీట మునిగిన పొలాలను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడనున్నారు. ఈ మేరకు కొత్త నవరసపురం, మాట్రేవు గ్రామాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. అలాగే తుఫాన్ షెల్టరును సందర్శించి అక్కడ పునరావాసం పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు.
Scroll for the next article