News21st Sep 12:25 PMSunil Byrisetty1 min read

కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజలతో మమేకమయ్యారు. కుప్పంలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్డీఓ, ఏఎస్పీ కార

కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజలతో మమేకమయ్యారు. కుప్పంలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్డీఓ, ఏఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. రూ.3.30 కోట్ల వ్యయంతో నిర్మించిన సమగ్ర ఘన వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్, మెటిరీయల్ రికవరీ సెంటర్ ప్రారంభించారు. 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.2.70 కోట్లతో చేపట్టనున్న మల్లనూర్ జూనియర్ కాలేజి పనులకు భూమిపూజ చేశారు. కుప్పం మున్సిపాలిటీ లో రూ.38 కోట్ల విలువైన ప్రభుత్వ పనులకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయ ఫీడర్ల కోసం 15 మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను చంద్రబాబు ప్రారంభించారు. కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Scroll for the next article