News3rd Oct 03:05 PMSunil Byrisetty1 min read
పాన్ ఐఐటీ సమ్మిట్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
పాన్ ఐఐటీ సమ్మిట్ జరుగుతున్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. ఆక్సి ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన డ్రోన్ ను పరిశీలించారు. సంస్థ ప్రతినిధుల కోరిక
పాన్ ఐఐటీ సమ్మిట్ జరుగుతున్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. ఆక్సి ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన డ్రోన్ ను పరిశీలించారు. సంస్థ ప్రతినిధుల కోరిక మేరకు డ్రోన్ పై సీఎం సంతకం చేశారు. వివిధ స్టార్టప్ లు, ఐఐటీయన్ల నూతన ఆవిష్కరణలను ముఖ్యమంత్రి పరిశీలించారు. పెట్రోలుతో నడిచే టూవీలర్లను గంటల్లో ఈవీలుగా కన్వర్ట్ చేసే సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శించిన సీఎం చంద్రబాబు సాధారణ వాహానాలను ఈవీలుగా కన్వెర్ట్ చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టును ఏపీలో ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖాన్ని స్కాన్ చేసి హెల్త్ రిపోర్టు ఇచ్చే యాప్ తయారు చేసిన సంస్థ స్టాల్ సందర్శించారు. నిమిషాల వ్యవధిలో ప్రాథమిక రిపోర్టు ఇవ్వగలమని సీఎంకు సదరు సంస్థ ప్రతినిధులు వివరించారు.