News10th Aug 02:28 PMSunil Byrisetty1 min read

సత్వర న్యాయంలో ఏపీ నెం. 1 కావటమే లక్ష్యం

ప్రజలకు సత్వర న్యాయం అందించటంలో ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కోన్నారు. ప్రజలకు న్యాయసహాయం, పోలీసింగ్ సహా వివిధ కేటగ

సత్వర న్యాయంలో ఏపీ నెం. 1 కావటమే లక్ష్యం
ప్రజలకు సత్వర న్యాయం అందించటంలో ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కోన్నారు. ప్రజలకు న్యాయసహాయం, పోలీసింగ్ సహా వివిధ కేటగిరీల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో నిలవటంపై వచ్చిన కథనాలపై స్పందించిన సీఎం రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ అంశాల్లో దేశంలో రెండో స్థానంలో ఏపీ కీలకమైన మైలురాయిని అందుకున్నా సంతృప్తి చెందటం లేదని.. ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టేంత వరకూ నిర్విరామంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలకు సత్వర న్యాయం అందటం శాంతిభద్రతలు, పోలీసింగ్, న్యాయవ్యవస్థ పనితీరు, సామాజిక, చట్టపరమైన పాలన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇండియా జస్టిస్ సంస్థ ఏపికి ర్యాంకింగ్ ఇచ్చింది. జగన్ హయాంలో రాజకీయ ప్రతీకారాలు, ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేసేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయటంతో ఏపీ ర్యాంకింగ్ దిగజారిపోయింది. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్ పడిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చట్టబద్ద పాలన తిరిగి వచ్చినట్టు ఇండియా జస్టిస్ రిపోర్టు పేర్కోంది.
Andhra Pradesh ranking
swift justice
CM Chandrababu Naidu
India Justice Report
AP policing
legal governance
law and order
ఇండియా జస్టిస్ రిపోర్ట్
ఏపీ పోలీసింగ్
న్యాయపరమైన పాలన
Scroll for the next article